ప్రజా విప్లవానికి నేటితో 14 ఏళ్ళు.. ‘మిలియన్ మార్చ్’ జ్ఞాపకాలను పంచుకున్న నెటిజన్లు

by Ramesh N |   ( Updated:2025-03-11 14:26:53.0  )
ప్రజా విప్లవానికి నేటితో 14 ఏళ్ళు.. ‘మిలియన్ మార్చ్’ జ్ఞాపకాలను పంచుకున్న నెటిజన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana movement) స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ప్రస్థానంలో "మిలియన్ మార్చ్" (Million March Movement) ఒక కీలక ఘట్టం. (మార్చి 10, 2011) నేటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను నెటిజన్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సర్మించుకున్నారు. చాలా మంది నెటిజన్లు వారు మిలియన్ మార్చ్‌లో పాల్గొన్నప్పటి ఫోటోలను ఎక్స్ వేదిగా జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా హరీశ్ రావు ట్వీట్ చేశారు. 'మిలియన్ మార్చ్'తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిందన్నారు. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టుకుని లక్షలాదిగా జనం తరలివచ్చారని వెల్లడించారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం.. అని పేర్కొన్నారు.

ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి జలమార్గం గుండా ట్యాంక్ బండ్ చేరుకొని, మిలియన్ మార్చ్ లో పాల్గొని నేటికీ 14 ఏళ్లు.. ఆ అపురూప దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయన్నారు. నాటి ఉద్యమ పోరాటాలు ఇంకా రగిలిస్తూనే ఉన్నాయని తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి సెల్యూట్.. ప్రాణాలు సైతం అర్పించిన అమరులకు జోహార్.. అని వెల్లడించారు.

Next Story