- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కృష్ణా జలాల పంపకాల గొడవ.. హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య పంచాయితీ ఇంకా ఒడిసిపోలేదు. నీటా వాటాపై రెండు రాష్ట్రాలు సఖ్యతకు రావడంలేదు. ఏపీ అడిగిన వాటాను తెలంగాణ ఒప్పుకోవడం లేదు. ఏపీతో పాటు తమకు సమానంగా వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు సఫలం అవుతున్నాయి. తాజాగా జరిగిన 17వ సమావేశం సైతం రెండు రాష్ట్రాల మధ్య వాటాను ఖరారు చేయలేకపోయింది. దీంతో మరోసారి భేటీ కావాలని కేఆర్ఎంబీ అధికారులు నిర్ణయించుకున్నారు.
ఏపీ, తెలంగాణ మధ్య నీటా వాటాను తేల్చేసేందుకు కృష్ణా నదీ యాజమన్య బోర్డు బుధవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ నందన్ కుమార్ అథ్యక్షతన జలసౌథలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల వాటాపై చర్చించారు. అయితే 66:34 నిష్పత్తిలో నీటిని కేటాయించాలని ఏపీ అధికారులు కోరారు. ఇందుకు తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు 50:50 వాటా ప్రకారం నీటిని కేటాయించాలని తెలంగాణ అధికారులు పట్టుబట్టారు. దీంతో ఈ సమావేశం అసంతృప్తిగా ముగిసింది. అటు నీటి వాటా కూడా ఖరారు కాలేదు. దీంతో ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నివేదికను అందించనుంది. మరి కేంద్ర జల శక్తి శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.