పైసా పైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొనుక్కున్నాం.. సాయిప్రియా నగర్ కాలనీ వాసుల ఆవేదన.

by Sumithra |
పైసా పైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొనుక్కున్నాం.. సాయిప్రియా నగర్ కాలనీ వాసుల ఆవేదన.
X

దిశ, మేడిపల్లి : పైసా పైసా కూడబెట్టుకుని వాయిదాల పద్దతిలో ప్లాట్లు కొనుక్కున్నామని ఇప్పుడు మా భూమి ప్రభుత్వ భూమి అనడం సరికాదని మేడిపల్లి మండలం పీర్జాదిగూడ సాయిప్రియనగర్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 1994 నుండి 2002 మద్య కాలంలో పేద మధ్యతరగతి ప్రజలు నెలకు 500 వందల రూపాయలు చొప్పున ఇన్ స్టాల్ మెంట్ లో ప్లాట్ లను కొన్నామని కాలనీ వాసులు తెలిపారు. ఇందులో అధికశాతం నిరుపేద కుటుంబాలు ఉన్నాయని వారు తెలిపారు. ఒక మహిళ కుట్టుమిషన్ మీద సంపాదించిన సంపాదనతో స్థలం కొంటే, మరొకరు కూలీపనులకు వెల్లి స్థలాన్ని కొన్నారు. అలాగే స్థలం కొన్న వారిలో ఓ రైల్వేరిటైర్ ఉద్యోగి కూడా ఉన్నారు.

ఇతనికి నలుగురు పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో ప్లాట్ కొనుక్కుంటే ప్రభుత్వం గుంజుకుందని దిగులుతో మంచం పట్టాడు. మరొకరు మిల్ట్రిలో పనిచేసి రిటైర్ అయితే వచ్చిన డబ్బుతో ప్లాట్ కొన్నారు. పైసా పైసా కూడ పెట్టుకున్న డబ్బులతో ప్లాట్లు కొనుక్కున్న 25 సంవత్సరాల తరువాత తమ భూమి ప్రభుత్వ భూమి అని అనడం సరికాదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అనేక దఫాలుగా కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుక పోగా వారు హామీ ఇచ్చిన మేరకు 118 జీఓలో సాయిప్రియ నగర్ పేరు చేర్చారు. అయినా పలితం లేదు 118 జీఓ ప్రకారం సాయి ప్రియ నగర్ సీలింగ్ ప్లాట్ల ను రెగ్లరైజ్ చేయడానికి వీలు లేకుండా పోయింది.

అందులో కేవలం నిర్మాణాలు ఉండి నివాసం ఉంటున్న వారికే రెగ్లరైజ్ అవుతాయి. 58,59 జీఓ లొ ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూమిలో ఉన్న ఇండ్లను రెగ్లరైజ్ చేస్తున్న ప్రభుత్వం వీరికి న్యాయం చేస్తుందా ? సాయి ప్రియ నగర్ ప్లాట్ల బాధితుల దుఃఖం తీరేనా, ఏది ఏమైనా వారికి న్యాయం జరగాలని పాలక పక్షంతో పాటుగా ప్రతిపక్షాలు కూడా కోరుకుంటున్నాయి. దీంతో సీలింగ్ ల్యాండ్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి తమప్లాట్ లలో చిన్నపాటి ఇండ్లను నిర్మించి తమ భూములను కాపాడుకోవాలని ఆశపడుతూ నిర్మాణాలు చేపట్టారు.

ఇంతలో వాటిని కూల్చాలంటూ మేడిపల్లి ఎమ్మార్వోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారనే వార్త విని ఆందోళన చెందుతున్నారు. మరో పక్క బాధితులు మంత్రిని కలవగా కూల్చవద్దంటూ మంత్రి ఎమ్మార్వో కు తెలియజేశారు. ఇప్పుడు వచ్చిన సమస్య అటు కలెక్టర్ ఇటు మంత్రి మధ్యలో ఎమ్మార్వో ఏ నిమిషం తమ భూముములు ఏమవుతాయో.. లేక మానవత్వంతో వదిలేస్తారో ఎదురుచూడాలి. శాశ్వత పరిష్కారం దిశగా ఇక్కడ నివసించే వారికి ప్లాట్లు రెగ్ల రైజ్ కావాలంటూ అక్కడ నివసించే వారితోపాటు ఎంతోమంది కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed