మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ..

by Kalyani |
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ..
X

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గిర్మపుర్ గ్రామంలో 9వ వార్డులో బస్తి దవాఖాన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. పెన్షన్లు, దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని స్థానికులు మంత్రిని మల్లా రెడ్డిని నిలదీశారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని మంత్రి మల్లారెడ్డిని అక్కడి నుంచి తరలించారు.

Advertisement

Next Story