- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి ఎనలేనిది: జేఎన్టీయూహెచ్వీసీ నర్సింహారెడ్డి

దిశ, కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించిన మేధావి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్కొత్తపల్లి జయశంకర్అని జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహా రెడ్డి అన్నారు. ప్రొఫెసర్జయశంకర్ జయంతి సందర్భంగా వర్సిటీలో ఆదివారం జరిగిన జయంతి కార్యక్రమంలో వీసీ నర్సింహా రెడ్డి, రిజిస్ట్రార్మంజూర్ హుస్సేన్‌లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీగా జయశంకర్ ఉన్నప్పుడు తానే విద్యార్థిగా ఉన్నానని, జయశంకర్‌ను దగ్గరనుండి చూసే అవకాశం తనకు దక్కిందని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములము కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల డైరెక్టర్‌లు పాల్గొన్నారు.