ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి: అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

by Kalyani |
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి: అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి అని అందుకు ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్ తో కలిసి అదనపు కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్ వ్యాప్తంగా 32 దరఖాస్తులు వచ్చినట్లు వారు వెల్లడించారు.

అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించాలని ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో పెట్టకూడదన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు వాటిని వెంటనే పరిష్కారించాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed