- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > కూకట్‌పల్లిలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారు : ఎమ్మెల్యే మాధవరం
కూకట్‌పల్లిలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారు : ఎమ్మెల్యే మాధవరం
by Mahesh |

X
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు తనకు పాదయాత్రలో బ్రహ్మరథం పడుతున్నారని, హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఫతేనగర్ డివిజన్‌లో శనివారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు కాలనీలలో ఇంటింటికి తిరిగి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే 95 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, డీఈ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Next Story