MLA Lakshmareddy : చర్లపల్లి డివిజన్ ను ఆదర్శంగా మారుస్తా

by Sridhar Babu |
MLA Lakshmareddy : చర్లపల్లి డివిజన్ ను ఆదర్శంగా మారుస్తా
X

దిశ, కాప్రా : చర్లపల్లి డివిజన్ కి అవసరమైన నిధులను వెచ్చించి ఆదర్శంగా అభివృద్ధి పరుస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏఎస్ రావు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధులు ఎంపల్లి పద్మారెడ్డి, నేమూరి మహేష్ గౌడ్, సారా అనిల్ ముదిరాజ్, గంప కృష్ణ, సారా వినోద్ ముదిరాజ్ చర్లపల్లి డివిజన్ అభివృద్ధి విషయమై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి విన్నవించారు.

కుషాయిగూడ పోచమ్మ గుడి, డిమార్ట్, శివ సాయినగర్, వాసవి శివనగర్ ప్రధాన రహదారిలో బాక్స్ డ్రైన్, రోడ్డు నిర్మాణం, చర్లపల్లి శ్మశానవాటిక, విస్టా ఓమ్స్ లో తప్పుగా వచ్చిన లక్షల రూపాయల నీటి బిల్లుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని చర్లపల్లి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed