కైట్ ఫెస్టివల్ తో రాష్ట్రానికి అంతర్జాతీయ కీర్తి

by Sridhar Babu |
కైట్ ఫెస్టివల్ తో రాష్ట్రానికి అంతర్జాతీయ కీర్తి
X

దిశ, తిరుమలగిరి : సంక్రాంతి పండుగ సందర్భంగా పెరేడ్‌గ్రౌడ్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం సందర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు స్వీట్ స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. అనంతరం అందరితో కలిసి ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి అని, ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో కూడిన ఆనందాలను తీసుకురావాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడానికి కృషి చేస్తుందని, అందులో భాగంగా నిర్వహిస్తున్న ఇలాంటి అంతర్జాతీయ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్స్ పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో దోహపడతాయని అన్నారు.

ఈ ఫెస్టివల్ లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి వివిధ దేశాల నుండి పతంగులు ఎగురవేయడానికి కైట్ ప్లేయర్ లు రావడం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్స్ తో పాటు విదేశాలకు చెందిన స్వీట్స్ లతో ఇక్కడ వందలాది స్టాల్స్ ఏర్పాటు చేసారని, ఇలాంటి కార్యక్రమాలతో మన దేశ సంస్కృతిని,సాంప్రదాయాలు దేశ విదేశాలలో విస్తరించడానికి, ఇతర దేశాల సంస్కృతిని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ వెస్టివల్ ఈ నెల 15 వరకు జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, ప్రేక్షకుల కోసం సకల సదుపాయాలు కల్పించిందని తెలిపారు. సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆయన వెంట స్థానిక నాయకులు, పలువురు అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed