సర్వ మతాలకు నిలయం హైదరాబాద్ మహానగరం

by Sridhar Babu |
సర్వ మతాలకు నిలయం హైదరాబాద్ మహానగరం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : సర్వ మతాలకు నిలయంగా తెలంగాణలో గంగా, జమున తహేజీబ్ నడుస్తుందని చత్తీస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కున్వార్ సింగ్ నిషాద్ అన్నారు. కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ లో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కుటుంబ సమేతంగా పాల్గొని కైట్స్ స్వీట్ జోన్లను సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్లో మూడు రోజుల పాటు కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ నిర్వహించటం ద్వారా హైదరాబాద్ తెలంగాణ కీర్తి పలు దిశల్లో వ్యాప్తి చెందుతుందని అన్నారు. అలాగే రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టడంతో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ మూడు రోజుల అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ లో దాదాపు 15 లక్షల మంది పాల్గొనటం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పించిందని అన్నారు. అదే విధంగా 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరం సర్వ మతాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా నిలుస్తుందని అన్నారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని స్టాల్స్ లలో అలాగే కైట్ జోన్లలో ఎక్కువగా ప్రజలు పాల్గొని వీక్షించడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ఏర్పాటు చేసిన స్టేజీ ద్వారా కళాకారులు జానపద, తెలుగు హిందీ పాటలతో పాటు తెలంగాణ ఉద్యమ గీతాలు పాడుతూ మంత్రముగ్ధులను చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నత అధికారులు పాల్గొని సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed