- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెంగ్యూ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: మంత్రి మల్లారెడ్డి
దిశ ప్రతినిధి, మేడ్చల్: డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా కీసరలో నిర్వహించిన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తో కలిసి మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తుందన్నారు.
స్థానికంగా దోమలు వృద్ధి చెందకుంటా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటే డెంగ్యూ రాదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రఘునాథస్వామి, డాక్టర్ సంధ్య, డాక్టర్ సరస్వతి, డాక్టర్ సరిత, డాక్టర్ కౌశిక్, శేషు, పద్మ తదితరులు పాల్గొన్నారు.