- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేఎన్టీయూహెచ్లో విద్యార్థుల ఆందోళన..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
దిశ, కూకట్పల్లి : జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థులు వర్సిటీ రిజిష్ట్రార్ మంజూర్ హుస్సేన్, కళాశాల ప్రిన్సాపాల్ చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు వర్షిత్, గాదె పవన్, రాహుల్ నాయక్‌లు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో రోజురోజుకు సమస్యలు పెరిగి పోతున్నాయని ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కనీసం సమస్యలు విన్నవించుకునేందుకు వెళితే వినడం లేదని, సమయం ఇవ్వడం లేదని అన్నారు. సీఆర్సీలో లిఫ్ట్ పనిచేయక పోవడం కారణంగా దివ్యాంగులైన విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.
హాస్టల్, కళాశాలలో వైఫై సౌకర్యం లక్పించాలని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి ఇప్పటి వరకు నూతన భవనం నిర్మించలేదని అన్నారు. అదేవిధంగా గత ఆరు నెలల క్రితం స్టడి టేబుల్, స్టడి చేయిర్లు ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వలేదని అన్నారు. సమస్యలు చెబితే ఇది ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ఇలాగే ఉంటుంది, ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ అని ప్రిన్సిపాల్ విద్యార్థులతో మాట్లాడుతు బెదిరిస్తున్నారని అన్నారు. వసతి గృహాలలో బాయిలర్స్ పాడై 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతులు చేయించలేదని, ఉడికి ఉడకని అన్నం తింటున్నామని అన్నారు.
సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌కు విన్నవించుకుంటే హెచ్ఓడీలకు చెప్పి బెదిరిస్తున్నారని అన్నారు. పై అధికారులకు సెన్స్ లేదు, నిధులు కెటాయించడం లేదు నేనేం చేయాలంటు ప్రిన్సిపాల్ వాదిస్తున్నారని విద్యార్థి నాయకులు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే తరగతుల బహిష్కరణ, విశ్వవిద్యాలయం బంద్‌కు పిలుపు ఇవ్వాల్సి ఉంటుందని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్లో అందుబాటులో లేక పోవడంతో రిజిష్ట్రార్ మంజూర్ హుస్సేన్‌కు వినతిపత్రాన్ని అందజేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శివకృష్ణ, బ్రహ్మం, ఆకాశ్, రంజిత్, మంజునాథ్, సారథి, ఆకాశ్, చందు, యశ్వంత్, స్నేహిత్ తదితరులు పాల్గొన్నారు.