- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా భారతదేశం
దిశ పటాన్ చెరు :యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మొదటి బ్యాచ్ కు చెందిన 43 మంది పట్టభద్రులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన శక్తిగా ఆవిర్భవించే అంశంలో భారత్ కు అనేక అనుకూల అంశాలు ఉన్నాయని తెలిపారు.
మనకు ఉన్న యువ శక్తితో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. దేశ అనుకూలతల ద్వారా 2047 నాటికి కార్పొరేట్ అండ్ పబ్లిక్ గవర్నెన్స్ లో ప్రపంచంలో అన్ని చోట్లా ఇండియన్స్ అగ్రస్థానంలో నిలుస్తారని తెలిపారు. ఇక్కడ చదువుకున్న వారంతా సమాజంలో మంచి పాలసీలు తీసుకువచ్చి సమాజంలో మార్పులు తీసుకురావాలని సూచించారు.
యువత నడుం బిగిస్తే 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కౌటిల్య అనే పేరు పెట్టుకున్న సంస్థలో చదివిన విద్యార్థులు ఆ పేరును నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు శ్రీ భారత్ తో పాటు గీతం విద్యా సంస్థల ప్రొఫెసర్లు, కౌటిల్య స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.