- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హామీలే తప్ప.. అమలు ఊసే లేదు : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
దిశ, హుస్నాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఆకర్షించేందుకు దళితబంధు, గిరిజన బంధు వంటి పథకాలను ప్రకటించారని.. వాటిని ఏమాత్రం అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు.
మంగళవారం పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, పేదలందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. అంబేద్కర్ కలలుగన్న పేదల సంక్షేమం నేటికి నెరవేర్చేందుకు పాలకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. దీంతో ప్రజల చిరకాల కోరిక అయిన కూడు, గూడు కల నేటికి నెరవేరక వారికి నిరాశే మిగిలిందన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి దశకు వచ్చిన ఇంకా రూ.వేయి కోట్లు వెచ్చించి ప్రాజెక్టు పని పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. మెట్ట ప్రాంత రైతుల కోసం గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకుడు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ జిల్లాల సీపీఐ జిల్లా కార్యదర్శులు మంద పవన్ మర్రి, మర్రి వెంకటస్వామి, కర్రె భిక్షపతి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.