- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Rains: జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం
దిశ, ఝరాసంగం: గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, శనివారం అర్ధరాత్రి నుంచి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. అత్యధికంగా హత్నూర్ లో 10.6, అందోల్, 10 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది, జిల్లాకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు, జహీరాబాద్ కొత్తూరు (బి) నారింజ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. వరద నీరు మొత్తం కర్ణాటక తరలిపోతుంది, ప్రాజెక్టు సామర్థ్యం 85 ఎంసిఎఫ్ టిలు, ఉండగా పూర్తి గా నిడింది. ఝరాసంగం మండలంలోని ఏడకులపల్లి చెరువు, జీర్లపల్లి, చిలేపల్లి వాగులు, చెరువులు పొంగిపొందుతున్నాయి,సంగారెడ్డి జిల్లా హత్నూర్ 10.6 సెంటిమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా జహీరాబాద్ 3.3 సెంటీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలు కురుస్తున్న వేళ జిల్లా యంత్రాంగం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు పని చేస్తుందని వారు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు ఉంటే తక్షణమే 08455-276155 సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రైతులు అత్యవసరమైతేనే పొలాల వద్దకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, చెరువు, కుంటలు, వాగుల వద్దకు వెళ్ళొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా నమోదు అయిన వర్షపాతం నమోదు వివరాలు
హత్నూర్ : 10.6 సెంటీమీటర్లు
అందోల్ : 10
పుల్ కాల్: 9.8
చౌటకూర్: 9.4
వట్టిపల్లి : 9.0
ఆర్ సి పురం: 8.5
పుల్కల్, జిన్నారం : 8.2
గుమ్మడిదల: 7.9
కొండాపూర్,కంది: 7.6
అమీన్ పూర్ : 7.4
పటాన్ చేరు, సుల్తాన్ పూర్, అల్గుల్ : 7.0
సంగారెడ్డి కలెక్టరేట్ : 6.7
మొగుడంపల్లి: 6.7
నిజాంపేట్: 6.6
కోహిర్, నల్లవల్లి : 6.5
మునిపల్లి: 6.4
మనూరు: 6.3
ఝ రా సంగం : 6.2
అత్యధిక వర్షపాతం నమోదు కాగా మిగతా ప్రాంతాలు సైతం భారీ వర్షం కురిసింది.
- Tags
- Heavy Rains
- rains