- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీలోకి టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు?
దిశ, డైనమిక్ బ్యూరో: టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. లోకల్ టాలెండెంట్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడి అడుగులు క్రికెటర్ నుంచి రాజకీయాల వైపు పడుతున్నాయనే టాక్ గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ లేదా జనసేన ఇలా ఆయన చేరబోయే పార్టీ ఇదేనంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. కానీ తాజాగా అంబటి రాయుడు చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. అతను ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడో ఈ ట్వీట్ తో పరోక్షంగా అర్థం అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అంబటి రాయుడు ఏపీ సీఎం జగన్ స్పీచ్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'గ్రేట్ స్పీచ్.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీ మీద పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు' అని క్యాప్షన్ చేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంబటి రాయుడు వైసీపీకీ మద్దతుగా నిలుస్తున్నారని త్వరలోనే ఆయన వైసీపీ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గుంటూరుకు చెందిన అంబటి రాయుడు కుటుంబానికి స్థానికంగా మంచి పేరు ఉంది. ఆయన తాత కూడా గ్రామ సర్పంచ్ గా పని చేసిన అనుభవం ఉండటంతో రాయుడు సైతం రాజకీయల వైపు మొగ్గు చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నాడని ఆపై పొలిటికల్ కెరీర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాయుడు ప్రయత్నిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆయన వైసీపీలో చేరుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి: Focus on Election: ఎన్నికల మూడ్‌లోకి సీఎం జగన్.. తొలి అభ్యర్థి ప్రకటన