అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి..?

by Kalyani |   ( Updated:2023-01-28 11:11:57.0  )
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి..?
X

దిశ, హుస్నాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ లో కలకలం రేపింది.స్థానికుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ పట్టణం కస్తూర్బాకాలనీలో నివాసం ఉంటున్న గడ్డం ప్రవీణ్ (22), పొట్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమ విఫలమైందనే కారణంతోనే హుస్నాబాద్ శివారులోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న మామిడి తోటలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో రెండు వాటర్ బాటిల్స్, గ్లాసులు పడి ఉండడం, ప్రవీణ్ ఉరేసుకునే సమయంలో యువతి కూడా మామిడి తోటలోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రవీణ్ ఉరేసుకునే సమయంలో ఇద్దరికీ తగాదా జరిగిందని, ఈ క్రమంలో యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు చెబుతున్నారు. కాగా ఉరేసుకొని చనిపోయాడా? లేదా ఎవరైనా చంపారా? అనే విషయాలపై పోలీసులు నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed