220 కేజీల గంజాయి నిందితుల అరెస్ట్..

by Kalyani |
220 కేజీల గంజాయి నిందితుల అరెస్ట్..
X

దిశ, సంగారెడ్డి : గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా నిందితులు పరారై మహారాష్ట్రలో దాగి ఉన్న ఇద్దరు గంజాయి నిందితులను సంగారెడ్డి, పటాన్ చెరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుంచి ఇద్దరు నిందితులను తీసుకువచ్చారు. 2024 వ సంవత్సరంలో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన 220 కేజీల గంజాయి కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను ఆదివారం ఎక్సైజ్ పోలీసులు మహారాష్ట్ర కెళ్ళి నిందితులను పట్టుకుని వచ్చారు. 220 కిలోల గంజాయి కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు అయింది. ఏ1 గా ఉన్న వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేయగా, ఏ2 ఉన్న అమర్ సంజయ్ కావాల్ ను, ఏ3 దిలీప్ ఆగాడ లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరు పరిచినట్లు సంగారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ డాక్టర్ నవీన్ చందర్ తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను పట్టుకొచ్చిన టీం లో పటాన్ చెరు ఎస్.హెచ్ఓ పరమేశ్వర్ గౌడ్, డీటీఎఫ్ సీఐ హనుమంతు ఇతర సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed