అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Shiva |
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ పటాన్ చెరు : నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, మండల పరిషత్, నీటి పారుదల, తదితర శాఖల అధికారులతో ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రతి గ్రామంలో ఇప్పటికే రూ.కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చివరి దశలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story