ఇండియన్ ఐడల్ లో సత్తాచాటిన సిద్దిపేట బిడ్డ

by Shiva |
ఇండియన్ ఐడల్ లో సత్తాచాటిన సిద్దిపేట బిడ్డ
X

ట్విట్టర్ లో లాస్య ప్రియను అభినందించిన మంత్రి హరీష్ రావు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 కాంపిటీషన్ లో సిద్దిపేట కు చెందిన గుమ్మనగారి లాస్య ప్రియ రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా లాస్య ప్రియను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్తు ఉండేలా దీవించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానంటూ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story