విద్యాక్షేత్రంగా.. సిద్దిపేట: మంత్రి హరీష్ రావు

by Shiva |
విద్యాక్షేత్రంగా.. సిద్దిపేట: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేటను విద్యాక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాల హస్టల్ సముదాయాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 1994లో అప్పటి సిద్ధిపేట ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ముందుచూపుతో పీజీ కళాశాల తీసుకొచ్చారన్నారు.

జర్నలిజం కోర్సు విద్యార్థులు మీడియా స్టూడియో, లాబొరేటరీ కావాలని కోరగా మూడు నెలల్లో అందుబాటులో తీసుకొస్తామన్నారు. స్కిల్ ల్యాబ్ సౌకర్యం కూడా అతి తొందరలో తెచ్చేలా ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దండబోయిన రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రీసెర్చ్ సెంటర్ గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఉన్నత విద్యలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, కౌన్సిలర్ శ్రీదేవి బుచ్చిరెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రవినాథ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ హుస్సేన్, పీజీ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధిపేట అర్బన్ పరిధిలో 121 మంది లబ్ధిదారులకు, కొండపాక మండలంలోని విశ్వనాథపల్లి, వెలికట్ట, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లోని 40 మంది లబ్ధిదారులకు జీవో నెం.58, 59 కింద ధృవీకరణ పత్రాలను మంత్రి హరీశ్ రావు లబ్ధిదారులకు అందజేశారు.

Advertisement

Next Story