పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Shiva |
పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ అమీన్ పూర్: పారిశ్రామిక రంగంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ పార్కులో శ్రీ బయో ఆస్తేటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి బయోటిక్ సెంటర్ ను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన సింగిల్ విండో మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మూలంగా నూతన పారిశ్రామిక పెట్టుబడులకు రాష్ట్రం కేంద్రంగా మారిందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఒకవైపు పరిశ్రమలు మరోవైపు ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా నిలవడం సంతోషంగా ఉంన్నారు.

ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పరిశ్రమ చైర్మన్ కే.ఆర్.కే రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ సైన్స్ విభాగం రిటైర్డ్ డీన్ బహదూర్, యోగి వేమన యూనివర్సిటీ మాజీ ఉప కులపతి అర్జున రామచంద్రారెడ్డి, డైరెక్టర్ నిఖిల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story