- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
35 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్
దిశ, సంగారెడ్డి : ఆర్టీసీ మెదక్ రీజియన్ లో పనిచేస్తున్న 35 మంది కండక్టర్, డ్రైవర్, మెకానిక్ లకు సూపర్వైజర్లుగా పదోన్నతి లభించినట్లు ఆర్టీసీ మెదక్ రీజియన్ రీజినల్ మేనేజర్ సుదర్శన్ తెలిపారు. గురువారం సంగారెడ్డిలోని కొత్త బస్ డిపోలో సూపర్వైజర్లుగా పదోన్నతి పొందిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రీజియన్‌లో గత నాలుగు సంవత్సరాల తరువాత సూపర్వైజర్ లుగా పదోన్నతి ఇవ్వడం జరిగిందన్నారు. మెదక్ రీజియన్ లో వివిధ డిపోలనుండి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ ల నుండి 35 మందికి సూపర్వైజర్ గా పదోన్నతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా.. ఎండీ ఆదేశాల ప్రకారం 35 మంది కండక్టర్, డ్రైవర్, మెకానిక్‌లకు సూపర్వైజర్లుగా పదోన్నతి లభించిందన్నారు. సూపర్వైజర్లు అందరూ అంకిత భావంతో సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఆర్టీసీని లాభాల బాటలో పయనించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ దైవాధీనం గార, పర్సనల్ ఆఫీసర్ సుజాత , అసిస్టెంట్ మేనేజర్ సంపత్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, వివిధ డిపోలకు చెందిన వారిలో ప్రమోషన్ పొందినవారికి ఆఫీస్ ఆర్డర్ కాఫీలను అందజేశారు.