బీఆర్‌ఎస్‌తోనే ప్రగతి సాధ్యం : ఎమ్మెల్యే

by Naresh |   ( Updated:2023-11-22 14:50:45.0  )
బీఆర్‌ఎస్‌తోనే ప్రగతి సాధ్యం : ఎమ్మెల్యే
X

దిశ, మెదక్ ప్రతినిధి: మెదక్ మరింత ప్రగతి వైపు సాగాలంటే బీఆర్ఎస్‌కే అవకాశం ఇవ్వాలని మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని 9, 11, 26, 27 తదితర వార్డుల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మెదక్ పట్టణం అభివృద్ధిలో ఎంతో వెనుకబడిపోయిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మాత శిశు సంరక్షణ ఆస్పత్రి, రైల్వే, పట్టణంలో రోడ్ల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం తదితర పనులు చేపట్టినట్లు వివరించారు. పట్టణంలో వైద్య కళాశాల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, గీతా, చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌కే‌ దక్కిందన్నారు.

కాంగ్రెస్ వస్తే కష్టాల పాలవుతామని, రేవంత్ రెడ్డి పంటల సాగుకు మూడు గంటల కరెంటు చాలు అంటుండగా.. మరో నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి రైతుబంధు నిలిపివేయాలని అంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, కౌన్సిలర్లు మేడి కళ్యాణి, జయశ్రీ, సుంకయ్య, సమియొద్దీన్, గడ్డమీద యశోద, శేకమ్మ, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్ మాజీ కౌన్సిలర్ చంద్రకళ, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, దుర్గాప్రసాద్, మధుసూదన్ రావు, శివరామకృష్ణ కొండ శ్రీనివాస్, జగదీశ్వర్, మధు జుబేర్, సంగ శ్రీకాంత్ , ఫాజిల్ పాపయ్య, కిరణ్, ప్రసాద్, అరవింద్, చందు పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed