Road Repair: నిధులు ఉన్నా.. పనులు సున్నా

by Aamani |
Road Repair: నిధులు ఉన్నా.. పనులు సున్నా
X

దిశ,దౌల్తాబాద్ : మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ, సరైన రోడ్డు లేక ఉప్పరపల్లి గ్రామస్తులు దశాబ్దాల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇస్తున్న నేటికీ నెరవేరలేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వేసిన మట్టిరోడ్డే నేడు ఆ గ్రామానికి దిక్కువవుతున్నది. చినుకు పడితే చిత్తడి గా మారే ఆ రోడ్డుతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కట్టనే మార్గంగా కాలం వెళ్లదీస్తున్నారు.విద్యార్థులు చదువుకోవాలంటే రోజూ నాలుగు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రోడ్డు నిర్మించాలి: మాజీ సర్పంచ్ ఉప్పరపల్లి చితరి గౌడ్..

చినుకు పడితే చిత్తడిగా తయారయ్యే రోడ్డుతో సంవత్సరాల తరబడి నరకయాతన అనుభవిస్తున్నాం. కనీసం ఉన్న రోడ్డుకైనా మరమ్మతులు చేపట్టి మా ఊరికి రవాణా సౌకర్యం కల్పించాలి. పేరుకు మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్ల ప్రయాణించాల్సిన పరిస్థితి దాపురించింది. కేవలం రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. చదువుల కోసం మండల కేంద్రానికి వెళ్లే మా విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతం. ఆడపిల్లలు నిత్యం కాలినడకన పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. గతంలో గోవిందా పూర్ నుండి బస్సు వేయాలని ఆర్టీసీ అధికారులను కోరిన వారు స్పందించడం లేదు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం చేపట్టి మా గ్రామానికి సౌకర్యం కల్పించాలి.

హామీలన్నీ నీటి మూటలే: రాజలింగం గౌడ్, ఉప్పరపల్లి గ్రామస్తుడు..

గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన మట్టిరోడ్డే ప్రస్తుతం మాకు దిక్కయింది. చెరువు కట్ట లేకపోతే మా ఊరుకు దారి లేదు.రోడ్డు నిర్మాణం కోసం ఎంతమందికి మొరపెట్టుకున్నా స్పందించిన వారు ఎవరూ లేరు. మా పిల్లలను పాఠశాలకు పంపించడం కోసం రోజూ దౌల్తాబాద్ లో దింపి మళ్లీ తీసుకువస్తున్న. నా సొంత పనులను వదులుకుని కేవలం పిల్లల చదువుల కోసమే నా సమయానికి కేటాయిస్తున్నా. నేను ఒక్కడినే కాదు మా గ్రామంలో చాలామంది పరిస్థితి ఇదే. ఇప్పటికైనా మా గ్రామానికి రోడ్డు నిర్మిస్తారని కోరుకుంటున్నా.

Advertisement

Next Story