- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదవాడి ఆకలి తీర్చే రేషన్ బియ్యంపై అధికారుల నిర్లక్ష్యం
దిశ,అల్లాదుర్గం: పౌర సరఫరా అధికారుల అలసత్వం మరోసారి బట్టబయలైంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో రేషన్ షాప్ వద్ద గ్రామస్థులు నాణ్యత లేని బియ్యం వద్దంటూ ఆందోళన చేపట్టారు. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత లోపం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లేకపోవడంతో పురుగుల రేషన్ బియ్యం సరఫరా జరుగుతుంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలోని రేషన్ షాప్ లో పురుగులు పట్టిన బియ్యం ఇస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధికారులు నిర్లక్ష్య ధోరణి కారణంగా పేదవాడి ఆకలిని తీర్చేందుకు ఇస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత లోపించింది. పండుగ ముందు వాపస్ చేస్తామని అదే బియ్యాన్ని పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్ నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గతంలో కూడా బియ్యం సరఫరాలు నాణ్యత లేకుండా పురుగులు పట్టిన బియ్యం ఇచ్చారు. ఈ క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఈ విషయంపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ఈసారి గ్రామానికి వచ్చిన పూర్తి కోటాలో సుమారు 300 క్వింటాళ్లకు పైగా వచ్చిన బియ్యంలో పురుగులు ఉన్నాయి. ఇలాంటి బియ్యం సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.