ముంపు బాధితులకు అండగా ఉంటాం.. మంత్రి దామోదర్ రాజనర్సింహా

by Sumithra |   ( Updated:2024-09-09 11:40:29.0  )
ముంపు బాధితులకు అండగా ఉంటాం.. మంత్రి దామోదర్ రాజనర్సింహా
X

దిశ, సంగారెడ్డి : ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో వర్షాలకు ముంపునకు గురైన రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీ, ఎర్రకుంటలో పర్యటించి భాధితులను ఓదార్చారు. నీట మునిగిన ఇండ్లను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పర్యటించి బాధితులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలలో 120 ఇండ్లళ్లకు వరద నీరు ఫీటు రెండు ఫీట్లు వచ్చాయన్నారు. వర్షం పడినప్పుడు నీరు పోయేందుకు దారి కావాలి. ఎర్రకుంట చెరువు ఇంపార్టెంట్ తూము చిన్నగ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎర్రకుంట మొత్తం 19 ఎకరాల చెరువు ఆయకట్టు పెద్ద గుంటది కానీ న్యాచ్ రల్ ప్లో ఆగిపోవడం వల్లే నీరు వచ్చిందన్నారు.

చంద్రయ్య కుంట, ఎర్రకుంట నుంచి నీరు పోయేందుకు దారి ఇవ్వాలి. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటిది జరగకుండా చర్యలు తీసుకుంటుంది. పట్టాభూములలో కాలనీలు, లే అవుట్లు, వెంచర్లు చేశారు. న్యాచ్ రల్ ప్లో కు దారి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందన్నారు. ప్రభుత్వం ముంపు బాధితులకు అండగా ఉంటుందని, తాను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటామన్నారు. వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా నీరు వెళ్లేలా ఇండ్లు కట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంత కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూన సంతోష్, కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జ్, నాయకులు బొంగుల రవి, ప్రదీప్, గంగేరి శ్రీహరి, ప్రదీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story