- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పర్యాటక కేంద్రంగా మానకొండూర్ పెద్ద చెరువు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
దిశ, మానకొండూర్: రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆన్నారు. మానకొండూర్ పెద్దచెరువు వద్ద సుడా నిధులు రూ.2కోట్లతో చేపడుతున్న సుందరీకరణ పనులకు సోమవారం ఆయన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2014లో మొదటి సారి ఎమ్మెల్యేగా మానకొండూరులో అడుగు పెట్టినప్పుడు గ్రామ ప్రజలు పెద్ద చెరువును సుందరీకరించాలని కోరారని గుర్తు చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు పెద్ద చెరువును సుందరీకరణ చేసేందుకు సిద్ధం అయిందన్నారు. చెరువు నిండా నీళ్లు, చెరువు కింద పండే పంటల వద్ద వడ్ల రాశులు, చెరువులో చెంగుచెంగున ఎగురుతున్న చేప పిల్లలు ఇక్కడ మనకు కనబడుతున్న దృశ్యాలని పేర్కోన్నారు.
చెరువు సమీపంలో రూ.25 లక్షలతో ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందింస్తున్నామని తెలిపారు. మండలకేంద్రంలోని పురాతన మహాంకాళి ఆలయం గతంలో పూర్తిగా శిథిలమై ముళ్ల పొదలతో ఉండేదని గ్రామస్థుల కోరిక మేరకు ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించామని తెలిపారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ సుడా నిధులతో చేపట్టే చెరువు సుందరీకరణ సమలతో నియోజకవర్గానికి మానకొండూర్ పెద్దచెరువు ఒక మణిహారంలాగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
మండల కేంద్రంలో రహదారి విస్తరణ పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. సదాశివపల్లి స్టేజి నుంచి మానకొండూర్ పోలీస్ స్టేషన్ వరకు రహదారికి ఇరువైపులా వీధిదీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మానకొండూరు పర్యాటక శోభను సంతరించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్ చార్జి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, బడ్పీటీసీ, సర్పంచ్ రోడ్డ పృధ్వీరాజ్, ఉపసర్పంచ్, సుడా వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.