ఈనెల 25న జర్నలిస్టులకు కంటి వెలుగు శిబిరం

by S Gopi |
ఈనెల 25న జర్నలిస్టులకు కంటి వెలుగు శిబిరం
X

దిశ, సంగారెడ్డి: ఈనెల 25న సంగారెడ్డి పట్టణంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. ఫిబ్రవరి 25న సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాలలో ఉదయం 9:00 గంటల నుండి 3:00 గంటల వరకు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు ఇట్టి కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కంటి వెలుగు శిబిరానికి తమ ఐడీ కార్డు, ఆధార్ కార్డుతో వెళ్లి కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ సదవకాశాన్ని సంగారెడ్డి నియోజకవర్గ పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story