Patancheru : సమయపాలన పాటించని నీటిపారుదల శాఖ అధికారులు

by Aamani |
Patancheru : సమయపాలన పాటించని నీటిపారుదల శాఖ అధికారులు
X

దిశ,పటాన్ చెరు : ప్రభుత్వ ఉద్యోగాలే కదా ఎవరేం చేస్తారన్న ధీమానో, లేక రెండు రోజులు వరుస సెలవుల కారణమో తెలీదు. కానీ సమయం 10 దాటినా అధికారులు నిద్ర లేవడం లేదు. పటాన్ చెరు నీటిపారుదల శాఖ ఉపకార నిర్వాహక ఇంజనీర్ సబ్ డివిజన్ కార్యాలయానికి ఉదయం 10 దాటిన తాళాలు దర్శనమిచ్చాయి. అడ్డగోలుగా కాలువలు, చెరువులు మాయమవుతున్న అలసత్వం ప్రదర్శించే అధికారులు కార్యాలయ సమయ పాలనలోను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మెల్లిగా 10:15 కు కార్యాలయ తాళాలు తెరచి ఆఫీస్ లోకి ప్రవేశించారు. ఆఫీస్ తెరిచిన 10:30 వరకు కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.

ఈ కార్యాలయంలో ఇంజనీర్లుగా పని చేసే అధికారులు సైతం ఫీల్డ్ విజిట్ పేరుతో తమ సొంత కార్యకలాపాలని చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు నిత్యం వినిపిస్తున్నాయి. అధికారులు బయటకు వెళ్లేముందు మినిట్ బుక్ లో అప్డేట్ చేయాల్సిన వివరాలను తమకు తోచిన సమయంలో రాస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏదైనా ఇష్యూ కోసం అధికారులను ప్రసన్నం చేసుకోవాలంటే ఫోన్ ద్వారా మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితులు పటాన్ చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలో నెలకొన్నాయన్న ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ విషయంలో దృష్టి పెట్టి సమయపాలన పాటించకపోవడంతో పాటు ఫీల్డ్ విజిట్ ల పేరుతో తమ సొంత పనులను చక్కబెట్టు కుంటున్న అధికారులపై దృష్టి పెట్టి పని దొంగల భరతం పట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story

Most Viewed