పదేళ్లలో వందల పరిశ్రమలు మూత

by Disha Web Desk 15 |
పదేళ్లలో వందల పరిశ్రమలు మూత
X

దిశ, జహీరాబాద్ : పదేళ్ల బీజేపీ పాలనలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదని, వందల పరిశ్రమలు మూసేసి, ఒకరిద్దరికి మాత్రమే వేల కోట్లు దోచి పెట్టారని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హన్మంతరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్ ట్కార్ కు మద్దతుగా మొగుడంపల్లి లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని, బీజేపీ ధనవంతుల పక్షమని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే అని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అన్ని మైనారిటీలకు పథకాలు ఇస్తామని ప్రకటిస్తున్న బీజేపీ, తెలంగాణలో మాత్రం మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనస్సులు గెలుచుకుందన్నారు. దేశంలో అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ గెలుపొక్కటే మార్గమన్నారు. ఈ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని, బీజేపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story