ఏడుపాయల దుర్గ మాత సేవలో కలెక్టర్

by Shiva |
ఏడుపాయల దుర్గ మాత సేవలో కలెక్టర్
X

దిశ, పాపన్నపేట : ఏడుపాయల వన దుర్గ భవాని మాతను జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. కలెక్టర్ ప్రత్యేక పూజల అనంతరం రేపు మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్న యాగశాలను పరిశీలించి ఏర్పాట్ల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మెదక్ ఆర్డీవో సాయిరాం, మెదక్ డీఎస్సీ సైదులు, ఆలయ ఈవో సార శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story