సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల బందోబస్త్

by Naresh |   ( Updated:2023-10-25 14:13:03.0  )
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల బందోబస్త్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: శాంతియుత వాతావరణంలో ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో చెక్ పోస్ట్, వెహికల్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవీఎం, వీవీ ప్యాడ్ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు గురించి కేంద్ర బలగాల బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ అధికారులు, స్థానిక ఏసీపీలతో సీపీ శ్వేత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కలిసి విధులు నిర్వహించాలన్నారు. ఓటర్లు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించడంలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలన్నారు. కీలకమైన ప్రదేశాలలో సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది విధులు నిర్వహించడంతో పాటుగా, వాహనాల తనిఖీలు చేపట్టాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో బీఎస్ఎఫ్ కమాండెంట్ ఇంద్రజిత్ చావ్లా, ఎస్ఎస్బీ కమాండెంట్ రఘునాథ్, అడిషనల్ కమాండెంట్ రవి, అసిస్టెంట్ కమాండ్ రాజేష్ కుమార్, ధర్మరాజ్, ఎస్ఎస్ రాథోడ్, రవి, సర్వేష్, అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రమేష్, సతీష్, సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ రాజు, ఎలక్షన్ సెల్ ఇన్స్ స్పెక్టర్ బిక్షపతి, ఎస్బీ ఇన్స్ స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్ స్పెక్టర్ ధరణి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed