సిద్దిపేట జిల్లాలో 2,020 ఎకరాల్లో పంట నష్టం

by Shiva |   ( Updated:2023-03-20 16:48:51.0  )
సిద్దిపేట జిల్లాలో 2,020 ఎకరాల్లో పంట నష్టం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: అకాల వర్షాలు, వడగళ్ల వానకు జిల్లాలో 2,020 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని 10 మండలాల పరిధిలో 153 ఎకరాల్లో వరి, 1669 ఎకరాల్లో మొక్కజొన్న, 198 ఎకరాల్లో పొద్దుతిరుగు పంటలకు అకాల వర్షాలకు నష్టం వాటినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

నంగునూరు మండల పరిధిలో 550 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. బెజ్జంకి మండలంలో 429 ఎకరాల్లో మొక్కజొన్న, 52 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, తొగుట మండలంలో 60 ఎకరాల్లో మొక్కజొన్న, 106 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, కొహెడ మండలంలో 87 ఎకరాల్లో వరి, 380 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, జగదేవ పూర్ మండంలో 56 ఎకరాల్లో వరి, 118 ఎకరాల్లో మొక్కజొన్న, సిద్దిపేట రూరల్ మండలంలో 15 ఎకరాల్లో మొక్కజొన్న, 8 ఎకరాల్లో పొద్దు తిరుగుడుకు నష్టం వాటిల్లింది.

అదేవిధంగా హుస్నాబాద్ మండలంలో 10 ఎకరాల్లో వరి, 14 ఎకరాల్లో మొక్కజొన్న, గజ్వేల్ మండలంలో 63 ఎకరాల్లో మొక్కజొన్న, చిన్నకోడూరు మండలంలో 10 ఎకరాల్లో మొక్కజొన్న, రాయపోల్ మండలంలో 30 ఎకరాల్లో మొక్కజొన్న, 22 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటలు అకాల వర్షాల కారణం నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 815 మంది రైతులకు చెందిన 2020 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా రుపొందించారు.

Advertisement

Next Story