అకాల వర్షాలు...1,500 ఎకరాల్లో పంట నష్టం

by Shiva |   ( Updated:2023-04-29 11:17:58.0  )
అకాల వర్షాలు...1,500 ఎకరాల్లో పంట నష్టం
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ లో అకాల వర్షాలు సృష్టించిన బీభత్సానికి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. రెండు రోజులు పాటు కురిసిన వర్షాలకు సంభవించిన పంట నష్ట వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల వీచిన ఈదురు గాలులు, వడగళ్ల వానలకు యాసంగి పంటలతో పాటు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ప్రధానంగా మామిడి, అరటి, బొప్పాయి పంటలు సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నాష్టం వాటిల్లింది. నియోజకవర్గంలోని 33 గ్రామాల్లో సుమారు 250 నుంచి 300 ఎకరాల్లో సాగవుతున్న యాసంగి పంటలు దెబ్బతిన్నాయని. అదేవిధంగా సుమారు 1,200 ఎకరాల్లో సాగు చేస్తున్న పనులు కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని రైతుల పేర్కొంటున్నారు. ప్రధానంగా 300 ఎకరాల్లో సాగవుతున్న మొక్కజొన్న, 10 ఎకరాల సోయాబీన్, 30 ఎకరాల జొన్న, ఎకరం గోధుమ పంటలకు నష్టం వాటిల్లింది.

అదేవిధంగా సుమారు 650 ఎకరాల మామిడి తోట, 38 ఎకరాల ఉల్లి, 7 ఎకరాల మిరప, 150 ఎకరాల బొప్పాయి, 60 ఎకరాల టమాట, 30 ఎకరాల బెండ, దోస, వాటర్ మిలన్, 80 ఎకరాల అరటి, 70 ఎకరాల ఇతర కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు రైతులు పేర్కొన్నారు. సుమారు 1,200 మంది రైతులు అకాల వర్షాలతో పోయినట్లు సమాచారం. ఇది వరకే పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లు ఏడీఏ వినోద్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story