పత్తి కుంట పెద్ద చెరువులో గండి.. నీరు వృధా..

by Aamani |
పత్తి కుంట పెద్ద చెరువులో గండి.. నీరు వృధా..
X

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలంలోని ర్యకల్ గ్రామం పత్తి కుంట పెద్ద చెరువు అలుగు దగ్గరలో గండి పడి నీరు వృధాగా వెళుతున్న విషయం గమనించి అక్కడికి గ్రామస్తులు చేరుకుని చెరువు గండిని మూసివేశారు. గ్రామస్తులు దీని మూలంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు దాదాపు 250 ఎకరాల నీటి పారకం ఉందని, కాబట్టి రైతుల సమస్యను వెనువెంటనే ఆర్ డి ఓ అశోక చక్రవర్తికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చారు.

తొందరలో స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీంద్ర నాయక్ ఉండి మరమ్మతులు చేపించారు. మాజీ సర్పంచ్ అంజయ్య, , మాజీ ఉప సర్పంచ్ సాయి రెడ్డి, మ్యాదరి శంకర్, ఉప్పరి పండరి, నర్సింలు , పండరి గ్రామస్తులు మరమ్మతులు చేపట్టారు. రెండు రోజుల క్రితం సిర్గాపూర్ మండల కేంద్రంలో కాకి వాగు గండి పడింది. అధికారులకు తెలిపిన ఎవరు రాకపోవడంతో గ్రామస్తులే మరమ్మత్తులు చేశారు.

Advertisement

Next Story

Most Viewed