రైతులకు ఆపద్భాందవుడు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Shiva |
రైతులకు ఆపద్భాందవుడు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, గుమ్మడిదల : రైతులకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గుమ్మడిదల, కానుకుంట, జిన్నారం, సొలక్పల్లి గ్రామాల పరిధిలోని రైతు వేదికల వద్ద నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల కానుకుంట గ్రామ రైతులు ఎడ్ల బండి ర్యాలీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అన్ని విధాలుగా రైతన్నలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. రైతులు రెండు పంటలు సమృద్ధిగా పండించుకునే అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రతి ఏటా అంచనాలకు మించి పంటలు ఉత్పత్తి కావడంతో పాటు, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం అవతరించిందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గుమ్మడిదల ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, నరేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు హుస్సేన్, రాజేష్, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story