- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వన్య ప్రాణుల వేట కోసం యత్నించిన 8 మందిపై కేసు నమోదు

X
దిశ, నర్సాపూర్: వన్యప్రాణులను వేటాడటం కోసం యత్నించిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ఫారెస్ట్ కార్యాలయంలో శనివారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలం నత్తినాయపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం బొంతపల్లి షేర్ ఖాన్ పల్లి నతినాయపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి వన్యప్రాణులను చంపడం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులతో పాటు ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపైన తెలంగాణ అటవీ చట్టంతోపాటు, వైడ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Next Story