- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుట్టుకు కూడా పన్నులు వేస్తున్న ఏకైక ప్రధాని మోడీ
దిశ, తూప్రాన్: నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దోళ్లకి సద్ది కడుతుంది అని, దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క దానిపై ధరలు పెంచుతూ పేదవాడి నడ్డి విరిస్తున్న ప్రభుత్వం బీజేపీ అని తెలంగాణ అటవీ శాఖ అభివృధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన తూప్రాన్ మండల్ కరీంగూడా చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. జాతీయ రహదారి కావడంతో దాదాపు రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పేదలకు ఎన్నడూ న్యాయం జరగలేదని జరగదు కూడా అని అన్నారు. పేదవాళ్ల పొట్టను కొట్టి పెద్దలైన ఆదానీ, అంబానీలకు పంచుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణలో బీదవారి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా పథకాలను ప్రవేశపెడుతుంటే దేశంలో మోడీ మాత్రం ప్రజలను నరకయాతన పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే ప్రజలు ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా జుట్టుకు కూడా పన్నులు వేస్తున్న ఏకైక ప్రధాని మోడీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించేవరకు తెలంగాణలో నిరసనలు దీక్షలు చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల నాయకులు, ఎంపీపీ పురం నవనీత రవి, రాష్ట్ర తెలంగాణ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఉమ్మడి మండలాల పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ ప్రసిడెంట్ నందలా శ్రీనివాస్, మనోహరబాద్ మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్, సతీష్ చారి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర సర్పంచులు పోరమ్ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు నారాయణ గుప్తా, మామిడి వెంకటేష్, బట్టి జగపతి, గుమ్మడి శ్రీనివాస్, సర్పంచ్ నాగభూషణం, వెంకటేశ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.