రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ, శివసేన నాయకులు.. క్షమాపణ చెప్పాలంటున్న టీపీసీసీ సభ్యుడు

by Sumithra |
రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ, శివసేన నాయకులు.. క్షమాపణ చెప్పాలంటున్న టీపీసీసీ సభ్యుడు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ, శివసేన నాయకులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి రవణీత్ బిట్టు, బీజేపీ నేత తర్వీందర్ సింగ్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ల ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం పై అవాకులు చెవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా వస్తున్న స్పందన చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్, నాయకులు అలకుంట మహేందర్, బుచ్చిరెడ్డి, మధు, రియజ్, కలిమోద్దీన్, గాయస్, మంద పండు. అజ్మత్, అంజిరెడ్డి, ప్రవీణ్, వనజ, కవిత, శారద, లత, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed