- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ బెడ్ రూంలలో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్ రాజర్షి షా
దిశ, మెదక్ ప్రతినిధి: డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో పెండింగ్ లో ఉన్న మౌలిక వసతుల పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం పిల్లి కొట్టాల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను, మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇంకా మిగిలిన ఎలక్ట్రికల్, డ్రైనేజీ, పెయింటింగ్, కిటికీలకు అద్దాలు, మంచి నీటి ట్యాంకులు, ప్లంబింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన పరిపాలన అనుమతులు వెంటనే మంజూరు చేస్తామన్నారు. అంతర్గత రహాదారుల వెంట పిచ్చి మొక్కలు తొలగించి, రోడ్డును సమాంతరంగా చదును చేస్తూ ప్రతి ఇంటి దగ్గర పూలు, నీడను ఇచ్చే మొక్కలు నాటేలా చూడాలని మునిసిపల్ కమిషనర్ కు సూచించారు.
క్రీడా మైదానం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. లబ్ధిదారులకు అందుబాటులో నూతనంగా రేషన్ దుకాణం, అంగన్వాడీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ ఈఈ పాండురంగా రావు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, మునిసిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, తహసీల్దార్ శ్రీనివాస్, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లు, తదితరులున్నారు.