అభయ యాప్ తో ప్రయాణికులకు భద్రత : పోలీస్ కమిషనర్

by Kalyani |
అభయ యాప్ తో ప్రయాణికులకు భద్రత : పోలీస్ కమిషనర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రయాణికుల సురక్షిత, భద్రత కోసం అభయ యాప్ దోహద పడుతుందని పోలీసు కమిషనర్ అనురాధ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అభయ్ యాప్ మై టాక్సీ సేప్ క్యూ ఆర్ కోడ్ ను సీపీ అనురాధ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ప్రయాణికుల భద్రత దృష్ట్యా పట్టణంలోని 1250 ఆటోలకు అభయ యాప్ స్టీకర్ చేయించినట్లు తెలిపారు. ప్రతి ఆటోకు అభయ యాప్ స్టిక్కర్ వేసుకోవాలని సూచించారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన ఈ అప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు అన్నారు.

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణ లో భాగస్వామ్యం కావాలన్నారు. ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. అభయ యాప్ ఆటో డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభయ యాప్ కోసం చెల్లించే రూ. 50 తో ఆక్సిడెంట్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ డ్రైవర్ కు వర్తిస్తుందన్నారు. జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభయ అప్ రూపకర్త అభి చరణ్ సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, సీఐలు ప్రవీణ్ కుమార్, మురళి, శ్రీధర్ గౌడ్, వాసుదేవరావు, విద్యాసాగర్, శ్రీను, ఆటో డ్రైవర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed