80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

by Nagam Mallesh |
80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
X

దిశ, హుస్నాబాద్; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అనుమతి లేకుండా తరలిస్తున్న 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నాగారం నుండి పోతారం వెళ్లే టాటా ఏస్ (TS 02 UC 3059) లో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట అంకుష్, హుస్నాబాద్ పట్టణానికి చెందిన అనిల్, రాజుల ఇండ్లలో అక్రమంగా దాచి పెట్టారని విచారణలో తేలింది. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హుస్నాబాద్ పోలీసులు తనిఖీలు చేసి 80 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story