- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రీతి కేసులో అనూహ్య ట్విస్ట్.. సైఫ్‌కు మద్దతుగా MBBS విద్యార్థుల ఆందోళన
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌కు మద్దతుగా ఎంజీఎంలో ఎంబీబీఎస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సైఫ్ అరెస్టును తప్పుబడుతూ శుక్రవారం ఎంజీఎం మెయిన్ గేట్ వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధకరమైన అంశం అని ఆవేదన వ్యక్తం చేసిన స్టూడెంట్స్.. కేసు విచారణ పూర్తికాకుండానే సైఫ్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సైఫ్‌కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. దీంతో అధికారులు సైతం అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story