- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Stop Hindi: దక్షిణాదిలో హిందీ వివాదంపై మావోయిస్టుల కేంద్ర కమిటీ లేఖ కలకలం

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాలపై (Stop Hindi) హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే (Communist Party of India (Maoist)) భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ స్పందించింది. జాతీయ విద్యా విధానం-2020ని అమలు చేయాలనే పేరుతో ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర ప్రభుత్వం హిందీ యేతర రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడానికి పూనుకుందని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేసే పేరుతో దక్షిణాదిలో పాఠశాల విద్యలో మూడో భాషగా హిందీని తప్పని సరిగా బోధించాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. త్రిభాషా సూత్రం పేరుతో హిందీని బలవంతంగా రుద్దడం గానీ, యూజీసీ నూతన నిబంధనలు గానీ ఇవి విడి విడి ఘటనలు కావని తెలిపారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘హిందూ రాష్ట్ర’(హిందూ దేశం) నిర్మాణంలో భాగమని తెలిపారు. అందులో భాగంగానే అది వన్ నేషన్, వన్ రేషన్ కార్డు, వన్ పవర్ గ్రిడ్, వన్ టాక్స్(జీఎస్టీ), వన్ పోలీస్, వన్ లాంగ్వేజ్, వన్ సివిల్ కోడ్, వన్ ఎలక్షన్, ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ పేరుతో అది నినాదాల్ని, విధానాలను రూపొందించినట్లు వెల్లడించారు. చివరికి హిందూమతాధారిత దేశంగా (హిందూ థియోక్రటిక్ స్టేట్) దేశాన్ని మార్చనున్నారని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగాన్ని మర్చి దాని స్థానంలో మనుస్మృతిని నిలబెడతారన్నారు. ఈ నిజాన్ని మరుగు పర్చడానికే 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మితస్తామని మోసపూరిత నినాదాలు ఇస్తున్నారని ఆరోపించారు. హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా, యూజీసీ నూతన నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న దక్షిణాది ప్రభుత్వాలు, వాటి పార్టీల వైఖరిని సమర్ధిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేవలం హిందీని వ్యతిరేకించే, యూజీసీ నిబంధనలను వ్యతిరేకించే, డీలిమిటేషన్‌ను వ్యతిరేకించే మేరకే తన నిరసనల్ని పరిమితం చేయకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీల విపక్ష్ ముక్త్ భారత్ నిర్మాణానికి హిందూ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు ముక్త్ భారత్ పేరుతో కేంద్రం కొనసాగిస్తున్న ‘కగార్’ దాడి అక్కడికే ఆగదు, అది కార్పొరేటీకరణ,సైనికీకరణ, హిందుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నింటిని, ఆర్బన్ నక్సల్స్‌గా, దేశద్రోహులుగా చిత్రీకరించి దాడిచేసి విపక్ష్ ముక్త్ భారత్‌ను హిందూరాష్ట్ర ఏర్పాటు చేసే వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అందుకే కగార్ దాడులను వ్యతిరేకించాలని కోరారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై, హిందీ యేతర రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రతిఘటించాలని సూచించారు. యూజీసీ నూతన నిబంధనల రద్దు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.