- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీడ్ పెంచిన కేసీఆర్.. మహారాష్ట్ర BRS కిసాన్ సెల్ అధ్యక్షుడి నియామకం
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధ్యక్షులను నియమిస్తూ చేరికల పర్వం కొనసాగిస్తుంది. తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిని నియమించింది. మహారాష్ట్ర కిసాన్ సెల్(బీఆర్ఎస్) అధ్యక్షుడిగా మాణిక్ కదమ్‌ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే యోచనతో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా, మహారాష్ట్రలోని ముంబైలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం పర్యటించారు. మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పనిచేస్తామని ఆ పార్టీ కవిత ప్రకటించారు. ముంబైలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళుర్పించారు.