Manda Krishna: సీఎం రేవంత్‌‌తో ముగిసిన భేటీ.. ప్రభుత్వానికి మంద కృష్ణ కీలక అభ్యర్థన

by Shiva |   ( Updated:2025-02-11 09:17:26.0  )
Manda Krishna: సీఎం రేవంత్‌‌తో ముగిసిన భేటీ.. ప్రభుత్వానికి మంద కృష్ణ కీలక అభ్యర్థన
X

దిశ, వెబ్‌డెస్క్: తన ఉద్యమానికి మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ (Classification of SC Reservations) అమలులో ఉప కులాల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన నివేదికపై చర్చలో ఆయన పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై చట్ట సభలో తీర్మానం చేసినందుకు గాను ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఉప కులాల్లో రిజర్వేషన్ల శాతం, గ్రూపుల విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లానని అన్నారు. అదేవిధంగా కులగణన లోపాలను సైతం సీఎం వివరించానని తెలిపారు. ఉపకులాల్లో ఏ, బీ, సీ మాత్రమే చేశారని.. తాము నాలుగు గ్రూపులుగా చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థించామని మంద కృష్ణ అన్నారు.

Next Story

Most Viewed