Manchu Family: యుద్ధానికి సిద్ధం అవుతోన్న అన్నదమ్ములు..! మనోజ్ ఇంటి వద్ద హైడ్రామా

by Shiva |
Manchu Family: యుద్ధానికి సిద్ధం అవుతోన్న అన్నదమ్ములు..! మనోజ్ ఇంటి వద్ద హైడ్రామా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ (Tollywood) హీరో మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబంలో వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఆస్తి తగాదాల్లో భాగంగా ఆదివారం ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ (Manchu Manoj) ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం భార్యతో కలసి నడవలేని స్థితిలో మంచు మనోజ్ బంజారాహిల్స్‌‌ (Banjara Hills)లోని టీఎక్స్ ఆసుపత్రి(TX Hospital)లో చేరారు. ఆ సందర్భంగా ఆయనకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డు (Emergency Ward)లో చికిత్సను అందజేశారు.

అనంతరం ఆయన ఆసుపత్రి నంచి డిశ్చార్జ్ అయి నేరుగా జల్‌పల్లిలోని తన ఇంటికి వెళ్లిపోయారు. అయితే, తాజాగా మనోజ్ ఇంటికి మంచు విష్ణు (Manchu Vishnu) బిజినెస్ పార్ట్‌నర్ విజయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడున్న సీసీ ఫుటేజ్‌కు సంబంధించి హార్డ్‌డిస్క్‌‌ను విజయ్ తన వెంట తీసుకెళ్లాడని సమాచారం. అదేవిధంగా మంచు మనోజ్ (Manchu Manoj) ఇంటి చుట్టూ విష్ణు మనుషులు రెక్కీ వేశారు. మరోవైపు మనోజ్ తన ఇంటి వద్ద ప్రైవేటు బౌన్సర్లతో కాపలా పెట్టుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన మంచు విష్ణు (Manchu Vishnu) మరికొద్దినేపట్లోనే మనోజ్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed