ముందు రెచ్చగొట్టింది ఆయనే.. కౌశిక్‌-గాంధీ వివాదంపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-15 12:46:29.0  )
ముందు రెచ్చగొట్టింది ఆయనే.. కౌశిక్‌-గాంధీ వివాదంపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(Arekapudi Gandhi), హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)ల వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యల వల్లే గాంధీ అలా వ్యవహరించారని అన్నారు. కౌశిక్‌ వాడిన భాషతో గాంధీ అనుచరులు బాధపడ్డారని చెప్పారు. కావాలనే వ్యూహాత్మకంగా కౌశిక్ రెడ్డి అందరినీ రెచ్చగొడుతున్నారని.. ప్రశాంత రాష్ట్రంలో కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

గాంధీభవన్‌ దేవాలయంతో సమానమని.. కార్యకర్తలు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. తన మార్గదర్శకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ.. విమర్శించుకుంటాం.. అవసరం వస్తే కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గాంధీ భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed