ఖాతాల్లోకి 'మహాలక్ష్మి' గ్యాస్ డబ్బులు!.. మెసేజ్ లు సోషల్ మీడియాలో ప్రచారం

by Ramesh Goud |
ఖాతాల్లోకి మహాలక్ష్మి గ్యాస్ డబ్బులు!.. మెసేజ్ లు సోషల్ మీడియాలో ప్రచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇచ్చే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి సంబందించిన సబ్సీడి డబ్బు అర్హులైన మహిళల ఖాతాలో జమ అవుతున్నట్లు మెసేజ్ లు వస్తున్నాయి. ఈ మెసేజ్ లకు సంబందించిన స్క్రీన్ షాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కో గ్యారెంటీని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాలు అమలు అవుతుండగా.. ఇప్పుడు అర్హులైన మహిళలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్ కార్డు దారులకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందజేయబడుతుంది.

ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసినా పలు కారణాల రిత్యా అమలుకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న అర్హులైన మహిళలకు రూ.500 తమ ఖాతాలో జమ అవుతాయని మెసేజ్ లు వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మెసేజ్ లో "ప్రియమైన కస్టమర్, మీకు వాగ్దానం చేసినట్లుగా, అభయహస్తం కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి ఎల్పీజీ పథకం కింద, సిలిండర్ రూ.500 లకు అందించడుతుంది మరియు రాయితీ మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. శుభాకాంక్షలతో మీ రేవంతన్న, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం" అని ఉంది. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన కొందరు మేమే పథకానికి అర్హులమే అయినా మాకు ఎటువంటి మెసేజ్ రాలేదని గందరగోళానికి గురి అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed